Search lyrics

Typing something do you want to search. Exam: Artist, Song, Album,Writer, Release Year...
if you want to find exactly, Please input keywords with double-quote or using multi keywords. Exam: "Keyword 1" "Keyword 2"

Shankar Mahadevan

Genres: Other

Padara Padara Lyrics - Shankar Mahadevan

భల్లుమంటు నింగి ఒళ్ళు విరిగెను గడ్డి పరకతోన 

ఎడారి కళ్ళు తెరచుకున్న వేళన చినుకు పూలవాన 

సముద్రమెంత దాహమేస్తె వెతికెనొ ఊటబావినే... 

 

శిరస్సు వంచి శిఖరమంచు ముద్దిడె మట్టినేలనే... 

 

పదర పదర పదరా! 

నీ అడుగుకి పదును పెట్టి పదరా! 

ఈ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా! 

 

పదర పదర పదరా! 

ఈ పుడమిని అడిగిచూడు పదరా! 

ఈ గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికి సమాధానమిదిరా! 

 

నీ కథ ఇదిరా, నీ మొదలిదిరా, 

ఈ పథమున మొదటడుగెయ్ రా! 

నీ తరమిదిరా, అనితరమిదిరా అని చాటెయ్ రా! 

 

పదర పదర పదరా! 

నీ అడుగికి పదును పెట్టి పదరా! 

ఈ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా! 

 

Related 

 

18 Non-Traditional Yet Perfect Wedding Songs 

 

NEW SONG: Miley Cyrus - 'Slide Away' - LYRICS 

 

HOT SONG: Lil Nas X - 'Panini' - LYRICS 

 

పదర పదర పదరా! 

ఈ పుడమిని అడిగిచూడు పదరా! 

ఈ గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికి సమాధానమిదిరా! 

 

ఓ' భల్లుమంటు నింగి ఒళ్ళు విరిగెను గడ్డి పరకతోన 

ఎడారి కళ్ళు తెరచుకున్న వేళన చినుకు పూలవాన 

సముద్రమెంత దాహమేస్తె వెతికెనొ ఊటబావినే... 

శిరస్సు వంచి శిఖరమంచు ముద్దిడె మట్టినేలనే... 

 

కదిలే ఈ కాలం, తన రగిలే వేదనకి, 

బదులల్లే విసిరిన ఆశల బాణం నువ్వేరా! 

పగిలే ఇల హృదయం, తన ఎదలో రోదనకి, 

వరమల్లే దొరికిన ఆఖరిసాయం నువ్వేరా! 

కనురెప్పలలో తడి ఎందుకని, తననడిగే వాడే లేక, 

విలపించేటి ఈ భూమి ఒడి చిగురించేలా... 

 

పదర పదర పదరా! 

ఈ హలమును భుజముకెత్తి పదరా! 

ఈ నేలను ఎదకు హత్తుకుని, మొలకలెత్తమని, పిలుపునిచ్చి పదరా! 

 

Check Out 

 

HOT SONG: Camila Cabello - 'Liar' - LYRICS 

 

23 One Hit Wonders You Still Can't Get Out Of Your Head 

 

LATEST SONG: Charlie Puth - 'Mother' - LYRICS 

 

27 Best Ever Songs From Movie Soundtracks 

 

పదర పదర పదరా! 

ఈ వెలుగను పలుగు దించి పదరా! 

పగుళ్లతొ పనికిరానిదను బ్రతుకు భూములిక మెతుకులిచ్చు కదరా! 

 

నీలో ఈ చలనం, మరి కాదా సంచలనం, 

చినుకల్లే మొదలై ఉప్పెన కాదా ఈ కధనం! 

నీలో ఈ జడికి, చెలరేగే అలజడికి, 

గెలుపల్లే మొదలై చరితగ మారే నీ పయనం! 

నీ ఆశయమే తమ ఆశ అని, తమకోసమని తెలిసాక, 

నువు లక్ష్యమని తమ రక్షవని నినదించేలా... 

 

పదర పదర పదరా! 

నీ గతముకు కొత్త జననమిదిరా! 

నీ ఎత్తుకు తగిన లోతు ఇది, తొలి పునాది గది తలుపు తెరిచి పదరా! 

 

పదర పదర పదరా! 

ప్రతొక్కరి కథవు నువ్వు కదరా! 

నీ ఒరవడి భవిత కలల ఒడి, బ్రతుకు సాధ్యపడు సాగుబడికి బడిరా! 

 

తనని తాను తెలుసుకున్న హలముకు పొలముతో ప్రయాణం 

తనలోని ఋషిని వెలికితీయు మనిషికి లేదు ఏ ప్రమాణం 

ఉషస్సు ఎంత ఊపిరిచ్చి పెంచిన కాంతిచుక్కవో 

తరాల వెలితి వెతికి తీర్చవచ్చిన వెలుగురేఖవో... 

Copyright: Song Discussions Is Protected By U.s. Patent 9401941. Other Patents Pending.

Are you remember?



Game

Artist: Nick Gill